చికెన్ మంచూరియా
కావలసిన పదార్థాలు
ఎముకలు లేని చికెన్ - అరకిలో,
సోయాసాస్ - 1 స్పూన్,
చైనా సాల్ట్ - అరస్పూన్,
మిరియాలపొడి - అరస్పూన్,
వెనిగర్ - 1 స్పూన్,
సాస్ కోసం :
మిరియాల పొడి - పావు స్పూన్,చైనా సాల్ట్ - పావుస్పూన్,
చికెన్ స్టాక్ (చికెన్ ముక్కలు కడిగిన నీళ్లు)- అరకప్పు,
కార్న్‌ఫ్లోర్ - 1 స్పూన్
మైదాపిండి - 2 స్పూన్లు,
సోయాసాస్ - 1 స్పూన్,
పంచదార- 1 స్పూన్
టమాటా సాస్- 1 స్పూన్,
అజినమోటో - చిటికెడు
ఉల్లికాడలు - 4,
వెల్లుల్లి ముక్కలు - 1 స్పూన్
తయారు చేసే విధానం
కార్న్‌ఫ్లోర్, మైదాపిండి, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, సోయాసాస్‌లను కలిపి...
అందులో కడిగిన చికెన్ ముక్కల్ని వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అరగంట నాననివ్వాలి. బాండీలో నూనె వేడిచేసి ఈ చికెన్ ముక్కల్ని వేయించాలి. తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వుంచుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు, సోయాసాస్, పంచదార, చికెన్ స్టాక్, టమాటా సాస్, ఉప్పు, మిరియాల పొడి, అజినమోటో వేసి కలపాలి. కొద్దిగా చిక్కబడిన తర్వాత ముందు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసి ఆ మిశ్రమం ముక్కలకు పట్టేవరకు కలపాలి. అంతేే రుచికరమైన చికెన్ మంచూరియా రెడీ.
andhra recipes are world famous,
Andhra vantakalu in telugu,
andhra kichen,
andhra food are very tasty

No comments:
Post a Comment