ladies tips, kitchen tips, vantalu, vantaillu, vantinti chitkalu,maguva, kitchen recipes
Saturday, 13 December 2014
దమ్‌కా బిర్యాని
చికెన్ - ఒక కిలో
ముందుగా మాసాన్ని శుభ్రంగా కడిగి కొద్ది గా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి ఆరబెటు కోవాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతుల నీళ్లు పోసి పొయ్యి మీద రైస్ సగం మాత్రమే ఉడికించాలి. పొయ్యి మీద మరో మందపాటి పాత్ర ఉంచి సరిపడా నూనె వేసి పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరు గులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా పాత్ర లో వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయా లి. ఇలాగే ఇంకో పొరలా మిగలిన మాంసాన్ని, అన్నాన్ని వేసి మూత పెట్టాలి. పాత్ర నుంచి ఆవిరి బయ టకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించు కోవాలి. దీనికి సైడ్ డిష్‌గా గోంగూరను కానీ, వంకాయ కూరను కానీ వేసి సర్వ్ చేసుకోవచ్చు.
Labels:
దమ్‌కా బిర్యాని
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment